ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ ర్యాంక్

TG: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా సుదర్శన్‌ రెడ్డి నియమిస్తూ రేవంత్ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 6 గ్యారెంటీల అమలు బాధ్యతను ఈయనకు అప్పగించారు. కేబినెట్‌ బెర్త్ కోసం సుదర్శన్ రెడ్డి పోటీపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బోధన్ ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు. అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రేమ్‌సాగర్‌ రావును నియమించారు. ప్రస్తుతం ఈయన మంచిర్యాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్