వేసవిలో మార్కెట్లలో కనిపించే పసుపు పచ్చని మామిడి పండ్ల వెనుక దాగి ఉన్న కాల్షియం కార్బైడ్ అనే విషపూరిత రసాయనాన్ని గుర్తించడానికి పంజాబ్ యూనివర్సిటీ పరిశోధకులు ఏఐ ఆధారిత మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు పండు నాణ్యతను కేవలం ఒక ఫోటోతో పరీక్షించవచ్చు. వ్యాపారులు లాభాల కోసం కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏఐ యాప్ పండు రంగు, ఉపరితలం, కాంతి పరావర్తనాన్ని విశ్లేషించి, అది సహజంగా పండిందా లేక రసాయనాలతో పండించబడిందా అని స్పష్టం చేస్తుంది.