వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీస్ డెస్క్‌పై క్యాలెండర్ ఉంచే దిశ కూడా కెరీర్, ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని నమ్మకం. క్యాలెండర్‌ను సరైన దిశలో ఉంచితే ప్రమోషన్, ధనయోగం వంటి సానుకూల ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఉత్తర దిశలో ఉంచితే ఆర్థిక అభివృద్ధి, ఆదాయ వృద్ధి జరుగుతుందని, తూర్పు దిశలో ఉంచితే కొత్త అవకాశాలు, ఉద్యోగ పురోగతి పెరుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అయితే దక్షిణ దిశలో ఉంచడం మంచిది కాదని, అది పనుల్లో ఆలస్యం, కెరీర్ అడ్డంకులకు కారణమవుతుందని భావిస్తారు.