అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం దీపావళిని అధికారిక పండుగగా గుర్తించింది. గవర్నర్ గవిన్ న్యూసమ్ అసెంబ్లీ బిల్లు 268పై సంతకం చేసి ఆమోదముద్ర వేశారు. 2026 నుంచి దీపావళి నాడు రాష్ట్రంలోని స్కూళ్లు, కమ్యూనిటీ కాలేజీలు సెలవుగా ఉంటాయి. కొత్త చట్టం ప్రకారం ఉద్యోగులు తమ ధార్మిక విశ్వాసాల ప్రకారం ఆ రోజు సెలవు తీసుకోవచ్చు.