ఈ నెల 10న స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపు

TG: విద్యారంగ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. జులై 10న ఈ బంద్‌ చేపట్టబోతున్నట్లు వెల్లడించాయి. బుధవారం హైదరాబాద్లో AISF, SFI, PDSU, AIDSO, AIFDS, AISB, AIPSU నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు బంద్‌కు సహకరించాలని కోరారు. అటు పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో రేపు కాలేజీల బంద్ చేపట్టనున్నట్లు బీసీ జేఏసీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్