AP: హిడ్మా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఆదివారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. హిడ్మాతో పాటు పలువురిని పోలీసులు హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారంటూ మావోయిస్టులు ఆరోపించారు. పోలీసు చర్యను నిరసిస్తూ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు. మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీసులు, భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఈ మేరకు పలు చోట్ల పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు.