1600 నంబర్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను ఏ యాప్ లేదా సేవ ద్వారా బ్లాక్ చేయడం సాధ్యం కాదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పష్టం చేసింది. ఈ నంబర్లు బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సేవల సంస్థలు వంటి ఆర్‌బీఐ, సెబి, ఐఆర్‌డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ నియంత్రణలో ఉన్న అధికారిక సంస్థల కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారని తెలిపింది. మరోవైపు 140 సిరీస్ నుంచి వచ్చే ప్రచార కాల్స్‌ను మాత్రం డూ నాట్ డిస్టర్బ్ (DND) రిజిస్ట్రీ ద్వారా వినియోగదారులు అనుమతించవచ్చు లేదా నిరోధించవచ్చు.