ఇయర్‌ఫోన్స్‌లో కెమెరాలు.. యాపిల్ సరికొత్త ఆవిష్కరణ!

ఇయర్‌ఫోన్స్‌లోనే అత్యాధునిక కెమెరాలను అమర్చిన కొత్త ఎయిర్‌పాడ్స్‌ను యాపిల్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. బీ790, బీ798 కోడ్ పేర్లతో పరీక్షలు జరుగుతున్న ఈ డివైజ్‌లు రాబోయే ఐఫోన్లతో పాటు సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎయిర్‌పాడ్స్ కేవలం ఆడియోకే కాకుండా, వినియోగదారు చుట్టూ ఉన్న వస్తువులు, ప్రదేశాలు, పత్రాలపై ఉన్న అక్షరాలను గుర్తించి AI ఆధారంగా సమాచారాన్ని అందించగలవని తెలుస్తోంది. డేటా ప్రాసెసింగ్ సమయంలో ఎల్ఈడీ సూచిక వెలిగేలా రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. వీటిని 'ఎయిర్‌పాడ్స్ అల్ట్రా' పేరుతో విడుదల చేసే అవకాశం ఉందని టెక్ నివేదికలు పేర్కొంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్