ఇవాళ పాతబస్తీ నుంచి గోల్కొండ కోటకు రానున్న ఘటాలు (వీడియో)

తెలంగాణలో ఆషాఢ మాసం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటలో బోనాల జాతర ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ రోజు ఆషాఢ మాసం రెండో ఆదివారం కావడంతో అమ్మవారికి నాలుగో పూజ నిర్వహించి భక్తులు తొట్టెలు సమర్పిస్తున్నారు. సాయంత్రం పాతబస్తీ నుంచి ఘటాలను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకెళ్లనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్