దసరా సెలవులు పొడిగిస్తారని ప్రచారం.. క్లారిటీ!

తెలంగాణలో దసరా సెలవులను పొడిగిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న (శుక్రవారం) పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆరోజుతో పాటు శనివారం కూడా సెలవు ఇస్తే, ఆదివారం కలిసి వస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే, సెలవుల పొడిగింపుపై విద్యాశాఖ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇటువంటి అనధికారిక సమాచారాన్ని నమ్మవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕