బాదంపప్పులు తింటే షుగర్ రాకుండా ఉంటుందా?

ప్రతిరోజూ బాదంపప్పులు తినడం వల్ల ప్రీడయాబెటిస్‌ను నియంత్రించడంతో పాటు భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. బాదంపప్పుల్లో ఉండే ప్రోటీన్, పీచుపదార్థం, మెగ్నీషియం, విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తికి కూడా మేలు చేస్తాయి. ప్రాసెస్డ్ స్నాక్స్‌కు బదులుగా బాదంపప్పులను ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్