అప్పులు చేయలేదని కేసీఆర్‌ చెప్పగలరా: జూపల్లి

తమ ప్రభుత్వ హయాంలో అప్పులు చేయలేదని కేసీఆర్‌ చెప్పగలరా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలపై చర్చకు వస్తారా అని అన్నారు. గత ప్రభుత్వం 7.3 లక్షల కోట్లు అప్పు చేసిందని, తాను చెప్పింది అబద్దమైతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని జూపల్లి వివరించారు. కార్పొరేషన్ పేరుతో అప్పు చేసి కాళేశ్వరం కట్టారని, ఆ అప్పును రైతుల నుంచి వసూలుచేస్తారా అని ఆయన అడిగారు.

సంబంధిత పోస్ట్