తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. ఒకవేళ తల్లికి డయాబెటిస్ ఉంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటేనే పాలివ్వాలంటున్నారు వైద్య నిపుణులు. తల్లికి షుగర్ ఎక్కువగా ఉంటే ఆ పాలు తాగిన బిడ్డలో చక్కెర స్థాయిలని నియంత్రించేందుకు ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుందని వివరిస్తున్నారు. అందువల్ల శిశువుకు హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం) ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.