చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచివే కానీ వాటిని తిన్న తర్వాత తగినంత నీరు తాగకపోతే మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చియా గింజలు నీటిని పీల్చుకొని కడుపులో విస్తరించుతాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో నీరు తాగకపోతే జీర్ణ సమస్యలు తీవ్రమవుతాయి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలట. నానబెట్టిన చియా గింజలు 1 టేబుల్ స్పూన్ వరకు, పొడి చియా గింజలు 1 టీస్పూన్ మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకోకూడదట.