‘నువ్వైనా జానూ ఆచూకీ చూపించమ్మా’.. పెంపుడు కుక్క వద్ద విలపించిన తల్లి

AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాడ పరిధి సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో ఈ నెల 6న జాహ్నవి (3) అనే బాలిక అదృశ్యమైన విషయం తెలిసిందే. బాలిక ఆచూకీ ఇంకా తెలియకపోవడం మిస్టరీగా మారింది. అయితే బాలిక వెంట వెళ్లిన పెంపుడు కుక్క ఇటీవల ఇంటికి తిరిగి వచ్చింది. ఆ పెంపుడు కుక్కను పట్టుకుని జాహ్నవి తల్లి.. ‘జానూ దగ్గరకు వెళ్లావా అమ్మ. నా బిడ్డను తీసుకువచ్చేస్తావా. నువ్వైనా జానూ ఆచూకీ చూపించమ్మా’ అంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది.

సంబంధిత పోస్ట్