ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్కల కలకలం (VIDEO)

TG: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్కలు వెలుగుచూడటం తీవ్ర చర్చనీయాంశమైంది. వర్సిటీ ఆవరణలో ఇవి పెరుగుతున్నట్లు గమనించిన సిబ్బంది తక్షణమే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యా నిలయమైన ఓయూలో మత్తు పదార్థాల మొక్కలు కనిపించడంపై అధికారులతో పాటు విద్యార్థి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందో సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులు విచారణ ప్రారంభించారు

సంబంధిత పోస్ట్

✕
✕