AP: కృష్ణా జిల్లా కంకిపాడులో కారు బీభత్సం సృష్టించింది. అంకమ్మతల్లి గుడి వద్ద శనివారం ఆడుకుంటున్న బాలుడిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మోక్షిత్ (7) అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. తమ ఆశల దీపం ఆరిపోయిందని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది.