TG: పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ముందు వెళ్తున్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కారు, బైకు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మొగులప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది.