ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో బుధవారం (జూలై 9) ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆడి కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన లధి (40), ఆమె 8 ఏళ్ల కుమార్తె బిమ్లా, భర్త సబామి (45), రామ్ చందర్ (45), అతని భార్య నారాయణి (35) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో బాలికతో సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో కారు ఓ ట్రక్కును ఢీకొని ఆగింది.