AP: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నుంచి విజయవాడ గొల్లపూడి వైపు వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారును, వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం నుజ్జునుజ్జు అవ్వడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం, లారీ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.