కొలంబియాలో కారు బాంబు పేలుడు (VIDEO)

కొలంబియాలోని విల్లావిసెన్సియో నగర కేంద్రంలో కారు బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో కనీసం 12 మంది గాయపడగా.. వారిలో మెటా గవర్నర్ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. పేలుడుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా, అత్యవసర సేవల బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడుకు కారణాలు, నిందితుల వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕