అదుపుతప్పిన కారు.. బైక్, ట్యాంకర్‌ను ఢీకొట్టి దగ్ధం (వీడియో)

AP: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు ముందుగా బైక్‌ను, తర్వాత ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న కొద్దిసేపటికి కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న ప్రయాణికులు సమయానికి బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సమాచారంతో ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్