AP: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ప్రమాదం జరిగింది. నార్కట్‌పల్లి- అద్దంకి-మేదరమెట్ల రహదారిపై వేగంగా వెళుతున్న కారు.. బైక్‌ను తప్పించే క్రమంలో ఎన్‌ఎస్‌పీ అద్దంకి బ్రాంచ్ కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న అయ్యప్ప మాలధారులు వెంటనే అప్రమత్తమై కారులో చిక్కుకున్న డ్రైవర్‌ను రక్షించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేస్తున్నారు.