భారీ వేగంతో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు (వీడియో)

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అర్ధరాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు నియంత్రణ కోల్పోయి, ఒక ఇంటి ప్రధాన గేటును బద్దలు కొట్టుకుంటూ నేరుగా ఆవరణలోకి దూసుకెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో ఇంట్లోని వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కారు వేగం ఎంతలా ఉందంటే, గేటు తునకలై లోపల ఉన్న వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ బయట లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్