TG: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌లో థార్ వాహనం బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ చెరువుకట్టపై అతివేగంతో దూసుకొచ్చి పలువురిని ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాహనం ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. పక్కనే ఉన్న చెరువులో పడి మరో యువతి చినిపోయింది. వాహనంలోని ముగ్గురికి గాయాలు కాగా వారిని భువనగిరి ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.