గుజరాత్ కర్జన్ పట్టణంలోని సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్లో ఓ కారు గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ఉధృతికి సిలిండర్ రెండు ముక్కలుగా చీలిపోయింది. కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.