ఢిల్లీలోని మయూర్ విహార్‌లో నవంబర్ 2న క్రౌన్ ప్లాజా యూటర్న్ సమీపంలో గ్రే కలర్ టాటా నెక్సాన్ కారు ఉబర్ బైక్‌ను ఢీకొట్టి, దాదాపు 900 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో అడ్వకేట్ శశాంక్ ఖండూరికి తీవ్ర గాయాలయ్యాయి. కారును ఆపే ప్రయత్నం చేసిన పాదచారులను కూడా డ్రైవర్ ఢీకొట్టినట్లు బాధితుడు పేర్కొన్నారు. మయూర్ విహార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది.