ఢిల్లీలోని కారు పేలుడు ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమైనదిగా, కలతపరిచేదిగా అభివర్ణించిన ఆయన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. "ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన అత్యంత బాధాకరమైంది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.