యూపీలోని ముజఫర్‌నగర్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పానిపట్-ఖతిమా బైపాస్‌లోని రాంపూర్ తిరాహా వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై ఇన్నోవా కారు అదుపు తప్పింది. ఇనుప రెయిలింగ్ విరిగి 20 అడుగుల లోతున ఉన్న పొలంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ నివాసితులు. కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.