మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ఇండోర్ నుండి AB రోడ్డులో చాముండా కాంప్లెక్స్ సమీపంలో ఓ కారు యాచకుడిని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఆ యాచకుడిని 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆ యాచకుడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్‌ను పట్టుకోవడానికి కొందరు ప్రయత్నించారు. అయితే కారుతో సహా నిందితుడు పరారయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.