TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న బైక్ను ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. దీంతో తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది.