AP: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏ. కొండూరు మండలం గోపాలపురం వద్ద బైక్‌ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కోండ్రుపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్‌కు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.