బెంగళూరు బనశంకరిలో తాజాగా రోడ్డు ప్రమాదం జరిగింది. కత్రిగుప్పె వాటర్ ట్యాంక్ పార్క్ రోడ్డులోని గణేష్ టెంపుల్ సమీప జంక్షన్ ప్రమాదాల కేంద్రంగా మారింది. వాహనాల మితిమీరిన వేగం, అక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడమే ఈ వరుస ప్రమాదాలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల కాలినడకన వెళ్లేవారు, వృద్ధులు, పిల్లల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.