భవానీ భక్తులను ఢీ కొట్టిన కారు.. నలుగురు మృతి

AP: కాకినాడ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం నుంచి 40 మంది భవానీ భక్తులు ఓ ప్రైవేటు బస్సులో విజయవాడకు వెళ్తున్నారు. బస్సు రిపేర్‌కు రావడంతో డ్రైవర్ ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో రోడ్డుపక్కన నిలిపాడు. దీంతో భవానీలు టీ తాగేందుకు కిందకు దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన స్కార్పియో వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

సంబంధిత పోస్ట్

✕
✕