AP: నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై జగదుర్తి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరుకు చెందిన ప్రమోద్ కుటుంబంతో కలిసి తిరుపతికి వస్తుండగా కారు క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమోద్ భార్య, కుమారుడు, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రమోద్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.