ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుది. వేగంగా వస్తున్న కారు DCMను ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మృతులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చెందిన అర్నాబ్ చక్రవర్తి, ఆయుష్ శర్మ, శ్రేష్ట్ పంచోలి, రిషిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.