ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి (వీడియో)

AP: విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. పూసపాటిరేగ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై నిలబడ్డ ఇద్దరిని ఢీకొట్టిన అనంతరం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాదచారులతో పాటు కారులోని మరో ఇద్దరు మరణించారు. కారు శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్