ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. సాప్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మ‌ర‌ణం (VIDEO)

TG: నల్లగొండ జిల్లా పానగల్ ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గంగసాని సాయి సందీప్ కారులో హైదరాబాద్ వైపు వెళ్తుండగా, ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్