ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన కారు... ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ధమన్‌గావ్ రైల్వే సరిహద్దు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్