పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి, 16 మందికి గాయాలు

రాజస్థాన్ జైపూర్ లోని జర్నలిస్ట్ కాలనీలో శుక్రవారం రాత్రి అతివేగంతో వచ్చిన ఆడి కారు డివైడర్‌ను ఢీకొని, రోడ్డు పక్కన ఉన్న వ్యాపారులు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. డజనుకుపైగా స్టాళ్లు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్