అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

TG: హైదరాబాద్ వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి, బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులు, మరో వ్యక్తి  చనిపోయారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు ఇంజినీరింగ్ ECE సెకండ్ ఇయర్ చదువుతున్న శివ, సందీప్ జోహెల్‌గా గుర్తించారు. కారు డ్రైవర్​ను తమకు అప్పగించాలని కళాశాల విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్