బోల్తా పడ్డ కారు.. నలుగురు మృతి

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో సోమవారం ఉదయం చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి శ్రీవారి దర్శనం ముగించుకుని బెంగళూరుకు తిరిగి వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. బెంగళూరులోని విద్యారణ్యపురానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు (శారదమ్మ, దీక్షిత, దేవేంద్ర కుమార్, జిష్ణు) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕