ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చక్రాత్-తుని మోటార్ రోడ్డులోని చిల్లాడ్ వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. 100 మీటర్ల లోతైన లోయలోకి కారు దూసుకెళ్లింది. కేవలం 22 సెకన్ల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కారులోని డాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో దుర్గేశ్ చౌదరి (39) స్పాట్‌లోనే మృతి చెందగా, సునీల్ మండల్, రిషభ్ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.