సెప్టెంబర్ 1 నుంచి కార్ల ధరలు పెంపు!

సెప్టెంబర్ 1 నుంచి టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నాయి. టాటా మోటార్స్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లపై గరిష్టంగా రూ.25,000 వరకు ధరలు పెంచుతుండగా, హ్యుందాయ్ తమ వాహన శ్రేణిపై గరిష్టంగా 1 శాతం వరకు ధరలు పెంచనుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాలు, ద్రవ్యోల్బణం, ముడి పదార్థాల ధరలు, నిర్వహణ వ్యయాలు, భౌగోళిక-రాజకీయ పరిస్థితుల ప్రభావం కారణంగా ఈ ధరల సవరణ చేపడుతున్నట్లు రెండు సంస్థలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్

✕
✕