విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ పరిధిలో గల GNIOT కళాశాల బయట ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న విద్యార్థులపైకి ఒక కారు ఒక్కసారిగా అదుపుతప్పి దూసుకెళ్లి ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాల్లోకి ఎగిరిపడగా, ఒక విద్యార్థి కాలుకు తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారుతో సహా అక్కడి నుండి పరారయ్యాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి కారును, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕