కూలీల‌పైకి దూసుకెళ్లిన కారు.. ఇద్ద‌రు మృతి

హరియాణాలోని గుర్గావ్ సమీపంలో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేపై బుధవారం అర్ధరాత్రి 2.30 గంటల తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరామ్ చౌక్ వద్ద ఫ్లైఓవర్ కింద ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్న నలుగురు కార్మికులను అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన 20 ఏళ్ల వేదాన్ ఖన్నాకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕