కారు-స్కూట‌ర్ ఢీ.. మామ, అల్లుడు మృతి

TG: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ప‌రిధిలో విషాదం చోటు చేసుకుంది. కారు-స్కూట‌ర్ ఢీకొన‌డంతో మామ‌, అల్లుడు మృతి చెందారు. స్థానికుల వివ‌రాల ప్ర‌కారం.. రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేష్(50) అల్లుడు కొల్లాపూర్ కు చెందిన ప్రవీణ్(32) ఇద్దరు కలిసి బైక్ పై రంగాపురం నుంచి పెబ్బేరుకు వెళ్తుండగా.. బైపాస్ దగ్గర హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న‌ కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలయిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్