కారు-టిప్పర్ ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారును టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న మద్దెల రమ్య, ఆనంద్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్