రాజస్థాన్‌లోని రాజసమంద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖంబల్గఢ్, ఖమనోర్ ప్రాంతాలతో పాటు పలు గ్రామాల్లో వర్షం ధాటికి రహదారులు మూసుకుపోయాయి. నదులు, వాగుల్లో భారీగా నీరు ప్రవహిస్తోంది. కురుస్తున్న వర్షానికి మచీంద్‌లో రోడ్డుపక్కన నిలిపిన ఓ కారు వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.