ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్యపై గతంలో చేసిన ప్రకటనను సంస్థ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పింది. దర్యాప్తు పూర్తికాకముందే ఆత్మహత్యకు కారణాలను నిర్ధారించడం సరికాదని స్పష్టం చేసింది. సాహిల్ పరీక్షలో ఫోన్, చాట్‌జీపీటీ వినియోగించాడని, అధ్యాపకుడు మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఐఐటీ తొలుత పేర్కొంది. దీనిపై కుటుంబ సభ్యులు, విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కుల వివక్ష, వేధింపులే కారణమని సాహిల్ కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో పరీక్ష సమయంలో పర్యవేక్షకుడిగా ఉన్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను ఐఐటీ సస్పెండ్ చేసింది.